Minister Narayana: ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఇవాళ జరిగిందని మంత్రి నారాయణ వెల్లడించారు. 41వేల కోట్ల టెండర్లను 2014-19లో పిలిచి 38వేల కోట్ల పనులు ప్రారంభించామని చెప్పారు. మధ్యలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్ అయిందన్నారు. రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. ఈ సంవత్సరం జులై 24న చీఫ్ ఇంజనీర్లతో కమిటీ వేశామన్నారు. పనులకు సంబంధించి చీఫ్ ఇంజినీర్ల కమిటీ అక్టోబర్ 29న 23 పాయింట్ల నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ప్రపంచబ్యాంక్ రూ.15 వేల కోట్ల రుణం ఇస్తుందన్నారు. గత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని నిర్ణయం ఇవాళ సమీక్షలో నిర్ణయించారని తెలిపారు. డిసెంబర్ 31 కల్లా అన్ని టెండర్లు పిలవాలని ఆదేశించామని వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి నిర్మూలన, నియంత్రణపై మంత్రుల కమిటీ ఏర్పాటు
హైకోర్టు, అసెంబ్లీ ఐకానిక్ టవర్స్ టెండర్లకు జనవరి ఆఖరు లోగా టెండర్లు పిలుస్తామని చెప్పారు. ఏడీబీ, వరల్డ్ బ్యాంక్ వరద పనులను త్వరగా ప్రారంభించాలని సమావేశంలో చర్చించామన్నారు. 217 చదరపు కిలోమీటర్లలో మూడు కాలువలు ఉంటున్నాయన్నారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరుల వద్ద రిజర్వాయర్లు, ఉండవల్లి వద్ద 756 క్యూసెక్కుల ఎత్తిపోతల, వైకుంఠపురం వద్ద 5600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాజధాని నగరం బయట మూడు రిజర్వాయర్లు పెట్టాలని నిర్ణయించారని వెల్లడించారు.వీటన్నిటికీ సీఆర్డీఏపై సీఎం సమీక్షలో అనుమతి లభించిందన్నారు. అమరావతి రైల్వే లైన్‌కు ల్యాండ్ పూలింగ్ జరుగుతుందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లు అనేవి రాబోయే వందేళ్ళ అభివృద్ధి ఆధారంగా సీఎం ఆలోచిస్తారని చెప్పారు. పవన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందించారు. డిప్యూటీ సీఎం కామెంట్స్ ఒక అలర్ట్‌లా తీసుకోవాలన్నారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ..” గత ప్రభుత్వం రాజధానితో మూడు ముక్కలాట ఆడింది.. ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో అమరావతి ఒకటిగా నిలిచేలా చర్యలు.. కొత్త టెండర్లు పిలవడానికి లైన్ క్లియర్.. రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయి..పనులకు సంబంధించి చీఫ్ ఇంజినీర్ల కమిటీ అక్టోబర్ 29న నివేదిక ఇచ్చింది.. ప్రపంచబ్యాంక్ రూ.15 వేల కోట్ల రుణం ఇస్తుంది.. డిసెంబర్ 31 కల్లా అన్ని టెండర్లు పిలవాలని ఆదేశించాం. ” అని పేర్కొన్నారు.