మంగళగిరిలో మంత్రి లోకేష్ పర్యటించారు. మంత్రి నారా లోకేష్, కందుల దుర్గేష్ చినకాకానిలో వంద పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలో భాగంగా 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం.. ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా 100 పడకల ఆస్పత్రి ఉంటుంది.. ఈ ఆస్పత్రిలో డీహైడ్రేషన్ సెంటర్ ను కూడా కలుపుతామని అన్నారు. అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయని అన్నారు.
Also Read:Viral : అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్ పేపర్‌లో విద్యార్థినీ సమాధానం వైరల్
ఇళ్ల పట్టాల హామీని కూడా నెరవేర్చాం.. నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ వాటర్, ఎలక్ట్రికల్, గ్యాస్, 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం.. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను.. పర్యాటక శాఖ నుంచి మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంకు నిధులు కేటాయించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కోరాను అని తెలిపారు.