Merugu Nagarjuna: మా నాయకుడి మాట మాకు వేదం.. గంగలో దూకమంటే దూకుతాం అని ప్రకటించారు మంత్రి మేరుగు నాగార్జున.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం స్కీములు తీసామని అంటున్నారు.. బహిరంగ చర్చకు రండి అంటూ సవాల్ చే శారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కార్యక్రమంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందన్న ఆయన.. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదు.. దానిలో అవకతవకలు జరిగాయన విమర్శించారు. మా నాయకుడిని చూసి మాకు ఓట్లేస్తారు.. నాయకుడి మాట మాకు వేదం.. గంగలో దూకమంటే దూకుతాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: K.A Paul: మోడీని చిత్తుచిత్తుగా ఓడిస్తా.. పాల్ సంచలన వ్యాఖ్యలు
ఇక, మా నియోజకవర్గ ప్రజలను సరి చేసుకొని సంతనూతలపాడు ప్రజలను గెలిపించమని అర్ధిస్తాం అన్నారు మంత్రి నాగార్జున.. తన నియోజకవర్గ మార్పుపై ఆయన మాట్లాడుతూ.. నారా లోకేష్ ఎర్రబుక్కు అంటూ పదే పదే అంటున్నారు.. లోకేష్.. ఎర్రబుక్కు మీ నాన్నకు ఇవ్వు.. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారు అంటూ ఎద్దేవా చేశారు. ఇంఛార్జ్‌ల మార్పులు చేర్పులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ మంచి కోసమే చేస్తున్నారని తెలిపారు.. మేం మార్చుకుంటే మీకేంటి అని ప్రతిపక్ష నేతను అడుగుతున్నా..? అని నిలదీశారు. చంద్రబాబు బీసీల దగ్గర పోటీ చేస్తున్నారు.. లోకేష్ ఎక్కడ పుట్టారు.. మంగళగిరిలో ఎలా పోటీ చేస్తారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి మేరుగు నాగార్జున.