ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 118 జీవో సమస్య పరిష్కారం అయిందని, ఎన్నో ఏళ్లుగా వేలాది మంది ఇండ్లు రిజిస్ట్రేషన్ అవ్వక ఇబ్బంది పడుతున్నారన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఐదు కిలోమీటర్లు మెట్రో వెంటనే కలుపుతామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇటు పెద్ద అంబరుపేట వరకు మెట్రోరైలు తెస్తామని, ఇస్నాపూర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు మెట్రోరైలు వస్తుందన్నారు. నమ్మశక్యం కానీ పనులు కూడా కేసీఆర్ పూర్తి చేసి నిరూపించారని, తెలంగాణ అలాగే సాధించారన్నారు. కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేశారని, ఇంటి ఇంటికి నీళ్లు కూడా ముందు ఎవరూ నమ్మలేదన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Airport Jobs: ఎలాంటి రాత పరీక్ష లేదు.. పది అర్హతతో ఉద్యోగాలు..
ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేస్తున్నామని, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు మంత్రి కేటీఆర్. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేస్తున్నామని, ఎస్‌ఆర్‌డీపీ, మెట్రోరైలు ఎంతో ఉపయోగ పడుతాయని, 415 కిలోమీటర్ల మెట్రోరైలు నగరం చుట్టూ నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ సమస్య ఏర్పడిందని, ఒక అధికారి చేసిన తప్పు వల్ల ఈ సమస్య ఏర్పడిందని, 14 కొత్త బ్రిడ్జి లు మూసి మీద కడుతున్నామన్నారు. ఎలక్షన్ టైం లో రాజకీయాలు చేద్దామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : GST Council Meeting: నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం పన్నుపై నిర్ణయం