Yandamuri: యండమూరి వీరేంద్రనాధ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రచనలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈయన రాసిన రచనల వలనే ఎంతోమంది హీరోలు స్టార్లగా మారారు. అందులో చిరంజీవి ఒకరు. చిరు హిట్లు అందుకున్న ఎన్నో సినిమాలు యండమూరి రచనలను ఆధారంగా చేసుకొని తీసినవే. ఇక మెగాస్టార్ అనే బిరుదును కూడా చిరంజీవికి అందించింది యండమూరినే. అంతగా వీరిద్దరి మధ్య స్నేహబంధం ఉండేది. అయితే ఆ స్నేహ బంధంలో పొరపచ్చాలు కూడా వచ్చాయి. యండమూరి ఎన్నోసార్లు చిరును విమర్శించి మాట్లాడినరోజులు కూడా ఉన్నాయి. ఇక అన్నను అన్నాడని యండమూరి పేరు చెప్పకుండా నాగబాబు ఎన్నోసార్లు కౌంటర్లు కూడా వేశాడు. ఇక ఇవన్నీ ఒకప్పుడు.. ఇప్పుడు చిరు- యండమూరి కలిసిపోయారు. ఇప్పటివరకు వీరి వివాదాల గురించి, విబేధాల గురించి నోరువిప్పని యండమూరి ఒక ఇంటర్వ్యూలో మొదటిసారి చిరుతో ఉన్న విబేధాల గురించి మాట్లాడాడు. ఈ మధ్య చిరు ఒక ఈవెంట్ లో తన జీవిత కథను యండమూరి రాస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆరోజు అసలు ఏం జరిగిందో యండమూరి వివరించాడు.
” మొదటిసారి నేను చిరంజీవి నటించిన మంచుపల్లకి సినిమాకు డైలాగ్స్ రాశాను. అప్పటినుంచి మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక విబేధాల గురించి చెప్పాలంటే.. భార్యాభర్తల మధ్య వచ్చే విబేధాలు లాంటివి. వస్తూ ఉంటాయి.. పోతూ ఉంటాయి. నాలుగేళ్ళ తరువాత నేను ఒక స్టేజిమీద చిరంజీవి ని కలిశాను. నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను. కానీ, ఆయన కళ్ళలో అదే ప్రేమ కనిపించింది. అప్పుడే చిరంజీవి అడిగాను.. నేను మీ జీవిత కథను రాయాలనుకుంటున్నాను. ఆయన వెంటనే ఆశ్చర్యపోయి.. నిజంగా రాస్తావా.. ? నువ్వు రాస్తే అంతకంటే కావలసిందేముంటుంది? ఈ స్టేజ్ పై ఎనౌన్స్ చేయనా? అని ఆ స్టేజిమీదనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య విబేధాలు లేవు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.