Minister Jogi Ramesh: టీడీపీ మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను నిండు నూరేళ్ళు జీవించి ఉండేవాడిని అని ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు.. ఒక క్షణం మళ్ళీ ప్రాణం పోస్తే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును అదే వేదిక పై సమాధి చేస్తానని ఎన్టీఆర్ దేవుడిని కోరుకుంటారన్న ఆయన.. తామే చెప్పులు వేసి, చిత్రవధ చేసి చంపిన వ్యక్తికి శతజయంతి పేరుతో వాళ్ళే దండలు వేసి దండాలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు.. మనుషులేనా మీరు? బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు చెబుతున్నాడు.. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు.
Read Also: Chandrababu: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సైకిల్ రెడీ.. జరిగేది కురుక్షేత్రం.. అజాగ్రత్త వద్దు..
ఇక, అచ్చెన్నాయుడు ఒక పనికి మాలినోడు.. అచ్చెన్నాయుడు పడుకోవటానికి ఒక సెంటు సరిపోదట అంటూ మండిపడ్డారు జోగి రమేష్.. పందిలా ఉన్న అచ్చెన్నాయుడు పడుకోవటానికి ఒక ఊరు కూడా సరిపోదు అని ఫైర్ అయ్యారు.. టీడీపీ నాయకులు ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారు.. తన హయాంలో చంద్రబాబు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదు.. కానీ, ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాఉతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ముసలోడికి దసరా పండగ అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం అన్నారు.. ఎన్టీఆర్ ఆత్మను ఇప్పటికీ చిత్రవధ చేస్తూనే ఉన్నారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి జోగి రమేష్.