Jogi Ramesh: చంద్రబాబు అందుకు రెడీనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సవాల్ విసిరారు. చంద్రబాబు ట్విట్ కు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలోని ఒక కోటి 50 లక్షల ఇళ్ళకు రావటానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడో లేదో చెప్పాలి అన్నారు. జగనన్న కాలనీల నిర్మాణాలు ఎలా ఉన్నాయో చూడటానికి రావాలని ఛాలెంజ్ చేస్తున్నాను. నీ కొడుక్కి పనీ పాటా లేదు. రోడ్ల మీద తిరుగుతున్నాడు. 14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా నీ పాలన, నాలుగేళ్ల పాలనలో జగన్ పాలన పై ఆలోచించాలి అన్నారు జోగి రమేష్.
Read Also: Terrible incident: పైసలు కోసం కన్న తల్లిని పైశాచికంగా చంపాడు
Also Read
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
- Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
ప్రజలకు అంత మంచి చేస్తే 2019 ఎన్నికల్లో 23 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యే వాడివి? అన్నారు మంత్రి జోగి రమేష్. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. పెడనలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు.మా భవిష్యత్తు జగనన్నే అనేది ప్రజల ఆకాంక్ష అంటున్నారు మంత్రి జోగిరమేష్. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో సీఎం జగన్ చేస్తున్నారు. బటన్ నొక్కగానే రైతులు , అక్కచెల్లెమ్మల అకౌంట్లలలోకి డబ్బులు జమ అయ్యేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం అన్నారు. విపక్షాల విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
చూడు… @ysjagan! ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు!
ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా?#SelfieChallengeToJagan pic.twitter.com/1yoMGd4yf9
— N Chandrababu Naidu (@ncbn) April 7, 2023
చంద్రబాబు అయినా, లోకేష్ అయినా నా ఛాలెంజ్ ను స్వీకరించాలి.లోకేష్ పాదయాత్రకు వస్తా. ఏ జగనన్న కాలనీ అయినా.. ఓకే.. మీరు చెప్ఫినా ఓకే…నన్ను చెప్పమన్నా సరే. రాష్ట్రంలో కోటిన్నర గడపలకు వెళ్ళటానికి చంద్రబాబు, లోకేష్ సిద్ధమా?? 2024 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూలిపోతాడు. జనం మెచ్చిన నాయకుడు జగన్. వెన్నుపోటు నాయకుడు చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో 151 కంటే ఎక్కువ స్థానాలతో మళ్ళీ వైసీపీ గెలుస్తుంది ..175 స్థానాల్లో సైకిల్ గుర్తు పై అభ్యర్థులను పెట్టే ధైర్యమే చంద్రబాబుకు లేదు. సీపీఐ నారాయణ, పవన్ కళ్యాణ్ అందరూ అంటకాగుతున్న సన్నాసులు అంటూ మండిపడ్డారు జోగి రమేష్.
Read Also: Actor Vishal: విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే
తాజావార్తలు
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
-
Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
-
Pakistan: టెంపోలో శవపేటికలు.. పాకిస్తాన్ పోలీసుల దుస్థితిపై తీవ్ర విమర్శలు
-
Maruti Suzuki July 2026 Offers: గుడ్‌న్యూస్.. మారుతి సుజుకి కార్లపై రూ. 2.10 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..