Madras High Court Gives Shock To Vishal: తమిళ హీరో విశాల్‌కు ఒక కేసులో మద్రాస్ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. మూడు వారాల్లోపు రూ.15 కోట్లు శాశ్వత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, లేకపోతే తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కాకుండా నిషేధం విధించడం జరుగుతుందని షాకింగ్ తీర్పునిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో కుదుర్చుకున్న ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో.. మద్రాస్ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీంతో.. అతడు కోర్టు విధించిన గడువులోపు రూ.15 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అసలేం జరిగిందంటే..
Dowry: నీ బిడ్డ చనిపోయింది శవాన్ని తీసుకెళ్లండి.. అత్తకు అల్లుడు ఫోన్
విశాల్ గతంలో తన నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ కోసం.. అన్బుచెళియన్ అనే ఫైనాన్షియర్ వద్ద నుంచి రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. నిర్ణీత సమయంలో ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేంత డబ్బు లేకపోవడంతో.. లైకా ప్రొడక్షన్స్‌ని సంప్రదించాడు. తన అప్పు తీరిస్తే.. అది చెల్లించేంత వరకు తన సినిమాల పంపిణీ హక్కుల్ని ఇస్తానని లైకా ప్రొడక్షన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో.. అతని అప్పుని ఆ సంస్థ తీర్చింది. ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి.. విశాల్ తన సినిమాల పంపిణీ హక్కుల్ని లైకా సంస్థను ఇస్తూ వస్తున్నాడు. కానీ.. కొంతకాలం క్రితం ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ, తన ‘వీరమే వాగై సూడుం’ సినిమాని రిలీజ్ చేశాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
Khushboo Sundar: ఆసుపత్రిపాలైన ఖుష్బూ.. అది చాలా చెడ్డదంటూ పోస్ట్
ఈ కేసుని విచారించిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు.. రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్ చేయాలని విశాల్‌కు ఆదేశించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అప్పీల్ చేయగా.. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపింది. రూ.15 కోట్లు విశాల్ చెల్లించాలంటూ సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అంతేకాదు.. ప్రత్యేక జడ్జి తన తుది తీర్పును వెలువరించేంత దాకా, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.