ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గెలుపు జోష్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా రేపు ( ఏప్రిల్ 9న ) సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో అడుగుపెట్టిన శిఖర్ ధావాన్ సేన ఇవాళ తమ ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొననుంది. ఇక ఇది ఇలా ఉండగా.. పంజాబ్ క్రికెటర్లు రాహుల్ చాహర్, హర్ ప్రీత్ బ్రార్ టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలిశారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రాహుల్ చాహర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Giovanni Vigliotto: నువ్వు మగాడివిరా బుజ్జి.. 100పెళ్లిళ్లు..14 దేశాలకు అల్లుడు..
కాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక అతిథ్య ఎస్ ఆర్ హెచ్ జట్టు లక్నో నుంచి ఇవాళ హైదరాబాద్ కు చేరుకోనుంది. వరుస ఓటములతో సమతమవుతున్న ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్ పై ఎలాగైనా గెలిచి టోర్నమెంట్ లో బోణీ కొట్టాలని చూస్తుంది. అయితే లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసింది. అయితే టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఫెలవ ప్రదర్శనతో ఎస్ ఆర్ హెచ్ పరాజయాలు అవుతుంది. లక్ష్య ఛేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 16 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేధించారు. కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా లక్నో విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read : MS Dhoni : ప్లీజ్ ధోని.. మీరు ఇప్పుడే రిటైర్మెంట్ అవొద్దు.. మహీకి పైలెట్ రిక్వెస్ట్