Bandlaguda Jagir: హైదరాబాద్‌లోని బండ్లగూడలో గణేష్ లడ్డూలు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఏకంగా 1.87 కోట్లు పలికింది. బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డూల వేలం నిర్వహించగా 25 మంది బృందంగా ఏర్పడి భారీ ధరకు లడ్డూలను కొనుగోలు చేశారు. కాగా, గణేష్ లడ్డూ గతేడాది కూడా ఇక్కడ రూ.1.26 కోట్లు పలికిన విషయం తెలిసిందే. కాగా, లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో పేదలకు సహాయం చేస్తామని ట్రస్ట్ ప్రకటించింది. హాస్టళ్లలోని పేద ప్రజలకు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. కాగా, ఈ నెల 7న ప్రారంభమైన వినాయక ఉత్సవాలు నేటితో ముగిశాయి. పలు చోట్ల గణేష్ నిమజ్జనాలు వేడుకగా జరుగుతున్నాయి.
Bangladesh Reform: కొత్తగా ఆరు సంస్కరణ నిర్ణయాలను తీసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం