టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి…
వైసీపీకి పిల్లి బోస్ గుడ్‌బై చెబుతారనే చర్చ జోరుగా సాగుతోంది.. ఇదే సమయంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట బోస్.. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌ను సైతం ఖాళీ చేసే ప్రయత్నాల్లో పిల్లి బోస్ ఉన్నారని తెలుస్తోంది.
అమరావతి రైతుల యాత్రకు భగవంతుడి ఆశీస్సులు లేవు.. అందుకే ఎక్కడికీ వారిని దేవుడు రానివ్వడం లేదని పేర్కొన్నారు బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.
శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కెబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అమ్మ ఒడి నిధుల విడుదలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారని తెలిపారు. అటు క్రీడాకారిణి జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఆక్వా…
పండుగల్లో కోవిడ్ జాగ్రత్తలు పాటించకుంటే కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓనమ్ పండుగ తర్వాతే కేరళలో మళ్లీ కోవిడ్ కేసులు విజృంభించాయని గుర్తుచేశారు… కరోనా నిబంధనలు పాటించాలని అలాంటి పరిస్థితి తీసుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ పలుచోట్ల కోవిడ్ పాజిటివిటీ రేటు 13శాతం ఉందని గుర్తుచేసిన మంత్రి.. వినాయక చవితిని ఇళ్లలోనే జరుపుకోవాలనేది…
గోదావరి జిల్లా వాసులు సంతోషం వస్తే పట్టలేరు. తేడా వచ్చిందో గోదారి యాసలోనే ఏకి పడేస్తారు. ప్రస్తుతం ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు రెండో కేటగిరీలోకి చేరారట. ఎమ్మెల్యేగా అందరివాడుగా ఉన్న ఆయన మంత్రి అయ్యాక కొందరివాడుగా మారారని ఒకటే కామెంట్స్. ఎమ్మెల్యే అంటే ఆయనలా ఉండాలన్న వారు.. ఇప్పుడు మాకొద్దు బాబోయ్ అని దూరం జరుగుతున్నారట. ఎందుకలా? ఆయనలో వచ్చిన మార్పులేంటి? ఎవరా మంత్రి? లెట్స్ వాచ్! ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుడ్‌మార్నింగ్ అని పర్యటించేవారు!…