జరుగుతున్నది మహానాడు కాదు మోళినాడు అంటూ వ్యాఖ్యానించారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంభందాల శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ . ఇవాళ ఆయన అంబేద్కర్ కోనసీమ రామచంద్రాపురంలో మాట్లాడుతూ.. వాలంటీర్ లను క్షమించమని తీర్మానం ప్రవేశ పెట్టాలన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఆత్మ క్షోభ కి గురి చేశాడని ఆయన అన్నారు. సిగ్గులేకుండా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడని, ఎన్టీఆర్ ను హింసించిన ఫోటోలతో ఎగ్జిబిషన్ పెట్టాలన్నారు. చంద్రబాబుకు సైకో లక్షణాలు వచ్చాయని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడ ఆయన ధ్వజమెత్తారు. పుష్కరాలలో మృతి చెందిన కుటుంబాలను క్షమించమని తీర్మానం పెట్టాలన్నారు.
Lakshmi Parvathi : ఎలక్షన్లు వచ్చినపుడే వీళ్ళకు ఎన్టీఆర్ గుర్తుకొస్తారు
ఇదిలా ఉంటే.. అమలాపురంలో నిర్వహించిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ మహానాడు పేరిట ఒక మోళీకి తెరతీసింది….చంద్రబాబు రాజమండ్రి లో నిర్వహిస్తున్నది మహానాడు కాదు.. అది మహా మోళీ నాడు… ఎన్టీఆర్‌ని దైవస్వరూపుడని,యుగపురుషుడని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం…ఎన్టీఆర్ ని అత్యంత దారుణంగా వెన్నుపోటు పొడిచి,ఆత్మక్షోభకు గురి చేసిన విషయం ప్రజులు మర్చిపోలేదు. ఎన్టీఆర్ సంక్షేమ పధకాలను బాబు అధికారంలోకి వచ్చి తుంగలో తొక్కాడయ.. కిలో రూ.2 బియ్యం రూ.5.30 ,రూ. 50 హార్స్ పవర్ విధ్యుత్ రూ.300 లపైకి పెంచాడు…మంత్రి వేణు. ఎన్టీఆర్ ప్రజలకు చేసిన మంచిని అడ్డుకున్నది చంద్రబాబు.. ఎన్టీఆర్ ని వ్యసన పరుడన్న చంద్రబాబు తెలుగుదేశానికి ఎన్టీఆర్ ఆదర్శమని చెప్పుకోవడం సిగ్గుచేటు.. చంద్రబాబు ఇప్పటికైనా సిగ్గుతెచ్చుకుని ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమం,అభివృద్ధిని ఆదర్శంగా తీసుకోవాలి.’ అని ఆయన అన్నారు.
Also Read : Ashwini Vaishnaw: 6 ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..