Minister Achchennaidu: బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి..
- బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి- మంత్రి అచ్చెన్నాయుడు
- 3.1 లక్షల హెక్టార్లలో పూర్తైన రిజిస్ట్రేషన్లు- అచ్చెన్నాయుడు
- అవసరం ఉన్న ప్రతి రైతుకూ అమలు- అచ్చెన్నాయుడు
- బకాయిలు చెల్లింపుతో బిందు సేద్యానికి పునరుజ్జీవం- అచ్చెన్నాయుడు
- వేగంగా కంపెనీలకు బకాయిల చెల్లింపులు- అచ్చెన్నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిందు సేద్యం అమలులో రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో దేశంలోనే బిందు సేద్యం అమలులో ఆంధ్రప్రదేశ్ 17.6% భాగస్వామ్యంతో ప్రథమ స్థానంలో నిలిచిందని, తిరిగి బిందు సేద్యం అమలులో రాష్ట్రం ప్రథమ స్థానంలోకి రావాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
JEE Main 2025: జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
Also Read
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ ఎత్తున బిందు సేద్యం కంపెనీలకు పెట్టిన బకాయిలు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించి పథకాన్ని తిరిగి పునరుద్ధరించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇప్పటికే 3.01 లక్షల హెక్టార్లలో 2.50 లక్షల మంది రైతులకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని, 6,797 మంది రైతులకు చెందిన 7,253 హెక్టార్లలో బిందు సేద్యం పరికరాలు ఇప్పటికే అందించామని వెల్లడించారు. మరో 13 వేల హెక్టార్లలో అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎన్డీయే ప్రభుత్వం బకాయిలు చెల్లించి పథకానికి పునరుజ్జీవం పోసి అమలులో వేగం పెంచామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Dulquer Salmaan: తెలుగులో ఈ హీరోలతో దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్?
ఇప్పటికే రూ.276 కోట్ల బకాయిలు చెల్లించామని, మరో పది రోజుల్లో రూ.104 కోట్లు చెల్లిస్తామని, నెల రోజుల్లో రూ.232 కోట్ల చెల్లింపులకు ఏర్పాట్లు చేసామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ (మైక్రో ఇరిగేషన్ ఫండ్) కూడా సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేస్తామని, త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖామంత్రిని కలిసి రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంపై చర్చించనున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉద్యాన శాఖ (MIDH) పథకానికి నిధులు రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర రైతాంగానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 3450 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామని తెలియచేశారు. మామిడి, జీడిపప్పు బోర్డు ఏర్పాటు, ఆయిల్ పామ్ సాగు నూతన మండలాల కేటాయింపు, ఆయిల్ పామ్ ధరల నిర్ణయం, కోకోనట్ బోర్డు ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు తదితర ప్రధాన అంశాలపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్కు ముందు సోనమ్ వాంగ్చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!