Sharwanand Join Hands For Rajinikanth Amitabh Bachchan Multistarrer: పెద్దగా సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న హీరో శర్వానంద్ తన 35వ సినిమా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ కనిమ మీద చాలా అంచనాలే పెట్టుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలో శర్వానంద్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జై భీమ్ తో యావత్ దేశాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శర్వానంద్ చాలా కీలకమైన పాత్రలో నటించబోతున్నాడని, ఇప్పటికే ఆయనకు కధ వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
Eleven: నవీన్ చంద్ర హీరోగా బై లింగ్యువల్ ‘ఎలెవెన్’
ఇప్పటికి ఇది నిజమో కాదో తెలియదు కానీ అదే నిజమైతే, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు శర్వానంద్‌కి ఇది సువర్ణావకాశం అనే చెప్పాలి, ఒకరకంగా బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే చెప్పాలి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రముఖ మలయాళ నటీనటులు ఫాహద్ ఫాజిల్, మంజు వారియర్ సైతం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారని కూడా టాక్ ఉంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారని కూడా అంటున్నారు. నిజానికి ముందుగా నానికి ఈ రోల్ ఆఫర్ చేశారని ఆయన చేస్తున్నాడని కూడా ప్రచారం జరగగా ఇప్పుడు అదే పాత్రను శర్వాకు ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు. నాని చేయనని చెప్పాడా? అందుకే శర్వాను అప్రోచ్ అయ్యారా? అసలు ఏమైంది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.