Nellore loan scam: కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు 10 కోట్ల 60 లక్షల రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్ళు పాల్పడ్డారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ.. సుమారు 56 మంది పేరిట లోన్లు కాజేశారు ఈ చీటర్స్. ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి.. గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి.. వారి పేరు మీద లోన్లు అప్లై చేసిన వ్యక్తులు.. ఫేక్ కంపెనీలో నుంచి ఆరు నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్లు క్రియేట్ చేసి.. యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు.
Read Also: WAR 2 vs Coolie : బడా నిర్మాత చేతుల్లోకి కూలీ నార్త్ రిలీజ్.. వార్ 2 కి గట్టి షాక్.
అయితే, 2022- 2024 మధ్య ఈ భారీ స్కామ్ జరిగింది. ఇక, లోన్లు కట్టాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం నోటీసులు పంపింది. 2024లో వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తుల పేరు మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. ఈ భారీ స్కామ్ లో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.