Medchal: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్నాడని బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిచినట్లు సమాచారం. ప్రశాంత్ అలియాస్ సోనుకి గోవుల తరలింపు సమాచారం ఇస్తానని కాల్పులకు ఇబ్రహీం తెగబడ్డాడు.
READ MORE: vv
రహదారి పక్కనే కారు నిలిపి కిట్టీ స్టీల్ పరిశ్రమ ఎదురుగా ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాడు. పథకం ప్రకారం ఇబ్రహీం, సోనుపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఛాతిలో బుల్లెట్ గాయాలతోనే రోడ్డుపై వరకు నడుచుకుంటూ వచ్చి సోను సింగ్ కుప్పకూలిపోయాడు. అతన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సోను సింగ్ ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సోను ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్లు సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అయితే పరారీలో ఉన్న ఇబ్రహీం అనే వ్యక్తి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాల్పులు జరిగిన చోట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
READ MORE: Russia Nuclear Drills: అమెరికాతో మీటింగ్ క్యాన్సిల్.. అణు ప్రయోగాలకు దిగిన రష్యా!