Medchal: మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం రేపింది. రాచకొండ కమిషనరేట్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం గోరక్షక్ సభ్యుడు ప్రశాంత్ అలియాస్ సోనుపై కాల్పులు జరిగాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. కీసర మండలం రాంపల్లికి చెందిన సోను గోవుల తరలింపు విషయంలో అడ్డుపడుతున్నాడని బహదూర్‌పురాకు చెందిన ఇబ్రహీం చౌదరి అనే వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి పిలిచినట్లు సమాచారం. ప్రశాంత్ అలియాస్ సోనుకి గోవుల తరలింపు సమాచారం…