Mayank Agarwal React on His Health: విమానంలో నీరు అనుకొని యాసిడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన కర్ణాటక రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై స్పందించాడు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరగా కోలుకుంటున్నానని తెలిపాడు. నేడు కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన అందరికీ ధన్యవాదాలు అని మయాంక్ పేర్కొన్నాడు. మయాంక్ చేసిన ఈ పోస్ట్‌ను క్రికెట్ అభిమానులు చూసి ఆనందం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని క్రికెట్ ఆడాలని ఫాన్స్ ఆకాంక్షించారు. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోను మయాంక్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.
రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపుర జట్టుతో మ్యాచ్ ఆడడం కోసం కర్ణాటక టీమ్ అగర్తాలకు వచ్చింది. మ్యాచ్ అనంతం అగర్తల నుంచి కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి ఇండిగో విమానంలో బయలుదేరాడు. సీటు ముందున్న పౌచ్‌లోని బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని మంచి నీళ్లుగా భావించి తాగాడు. కొద్దిసేపటికే మయాంక్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వాంతులు, గొంతు వాపు, బొబ్బలతో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. మెడికల్ ఎమర్జెన్సీతో విమానం అగర్తాలకు వెనక్కి రాగా.. హుటాహుటిన అతడిని ఆస్పుత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స అనంతరం అతడి ఆరోగ్యం కుదుటపడింది.
Also Read: Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనమిది మంది మృతి!
వైద్యుల సూచనల మేరకు మయాంక్ అగర్వాల్‌ను కర్ణాటక క్రికెట్ సంఘం బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. అక్కడ అతడికి మరిన్ని టెస్టులు చేసే అవకాశం ఉంది. మయాంక్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, అతని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత బెంగళూరుకు తీసుకొస్తామని కర్ణాటక క్రికెట్ సంఘం రంజీ జట్టు వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు భారత్ తరఫున 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. 4 సెంచరీల సహాయంతో టెస్టులో 1488 పరుగులు చేయగా.. వన్డేల్లో 86 పరుగులు చేశాడు.