AjithKumar: కోలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో తలా అజిత్, ఆయన భార్య షాలిని టాప్ 10 లో ఉంటారు. అజిత్ ను ప్రేమించి పెళ్లాడింది షాలిని. వీరి ప్రేమకథ కూడా ఒక సినిమాకు తక్కువేం కాదు. అజిత్, షాలిని ప్రధాన పాత్రల్లో 1999లో అమర్కలమ్ అనే సినిమా చేస్తున్న సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ సినిమా సమయంలో జరిగిన ఒక చిన్న ఘటన వారి పెళ్లికి పునాది వేసింది. షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం షాలిని చేతిని చాకుతో కట్ చేయాల్సి ఉండగా.. అజిత్ అనుకోకుండా ఆమె చేతిని గట్టిగా కోసేశాడు. రక్తం మరకలతో షాలిని బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయింది. ఇక ఆ గాయం తనవలనే జరిగిందని అజిత్, షాలినిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడట. రోజుకు మూడు సార్లు ఫోన్ చేసి తిన్నావా..? టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగేవాడట. అతని కేరింగ్ కు ఫిదా అయిపోయిన షాలిని అజిత్ ప్రేమలో పడిపోయింది.
Gopichand: ఆయన గొప్పోడు.. నువ్వేం పీకావ్.. హీరోకు డైరెక్టర్ సూటి ప్రశ్న
ఇక ఆ సమయంలో అజిత్- షాలిని ప్రేమ కథ తెలుసుకున్న డైరెక్టర్ఒకరు అజిత్ కు వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఆ తరువాత ఇద్దరి ప్రేమ ఒరిజినల్ అని తెలుసుకొని అతనే వీరి పెళ్లి చేసాడట. అలా అజిత్- షాలిని వివాహం 2000 సంవత్సరంలో ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.. అనౌష్క కుమార్, అడ్విన్ కుమార్. పెళ్లి తరువాత షాలిని సినిమాలకు దూరమై.. ఇంటికే పరిమితమయ్యింది. పెళ్ళికి ముందే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, దానికి తానేమి రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదని చెప్పుకొచ్చింది. నేటికీ ఈ జంట ఒక్కటి అయ్యి 23 ఏళ్ళు అవుతోంది. తమ 23 వ వార్షికోత్సవాన్ని ఈ జంట ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కేక్ కట్ చేసిన అనంతరం షాలిని భర్తను తన బిగి కౌగిలిలో బంధించి ప్రేమను చూపిస్తున్న ఫోటో అది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నా కూడా ఈ జంట ఎంతో అందంగా కనిపిస్తున్నారు. నేడు వీరి పెళ్లి రోజు కావడంతో అభిమానులు ఈ జ్ఞతకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా అయ్యో ఎంత క్యూట్ గ ఉన్నారు.. దిష్టి తగిలేనేమో అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.