కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన ప్రదేశంలోనే నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు అయ్యాయి.
తిరుపతి జిల్లాలోని చంద్రగిరిలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కొంగరవారి పల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కల్వర్ట్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటన ప్రదేశంలోనే నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హస్పటల్ కు తరలించారు.