జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంపంతో ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. సైన్స్ ఏజెన్సీ సునామీ హెచ్చరిక జారీ చేసింది. సునామీ అలలు 10 అడుగుల వరకు ఎగరిపడొచ్చని ఆ ఏజెన్సీ తెలిపింది. జపాన్ ఉత్తర తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం వచ్చిన వెంటనే, ఈశాన్య తీరంలోని అనేక ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు అధికారులు. Also Read:భారత మార్కెట్‌లో HMD కొత్త HMD 100,…
Earthquake : తైవాన్‌లో ఈ రోజు (బుధవారం) శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో ద్వీపం మొత్తం వణికిపోయింది. వందలాది భవనాలు కుప్పకూలాయి. జపాన్ దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు సునామీ హెచ్చరిక జారీ చేసింది.
దక్షిణ అమెరికా దేశం పెరులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దక్షిణ పెరులోని అజాంగారో పట్టణానికి పశ్చిమ వాయువ్యంగా 8 మైళ్లదూరంలో భూకంప కేంద్రం ఉంది. లిటికాకా సరస్సుకు సమీపంలో ఈ భూకంపం సంభవించింది. ఈ ప్రాంతం పెరు- బొలీవియా దేశాల సరిహద్దుల్లో ఉంది. దాదాపుగా 217 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్ర ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఇదిలా ఉంటే…