మంగళవారం జగదేవ్‌పూర్‌లోని మునిగడప వద్ద మల్లన్న దేవాలయం సమీపంలో కారు అదుపు తప్పి కేఎల్‌ఐఎస్ కెనాల్‌లోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతీ ఆల్టో కారులో ముగ్గురు మహిళలు, ఒక బాలుడు సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు కారులోంచి నాలుగు మృతదేహాలను వెలికితీయగా, తీవ్ర గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరొకరు మృతి చెందారు.
Also Read : Anil Kumar Yadav: మంత్రి పదవి నుంచి తొలగించి సీఎం మంచే చేశారు.. మాజీ మంత్రి అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులకు సంబంధించి వివరాలు తెలియరాలేదు. మృతులు ఎక్కడికి చెందిన వారు? ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : China Warns: జాగ్రత్తగా ఉండండి.. జపాన్‌తో స్నేహంపై ఆస్ట్రేలియాకు చైనా వార్నింగ్