సిద్దపేట జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనం చేసుకుని తిరిగివెళుతుండగా జరిగిన ప్రమాదంలో ఓ కుటుంబం మొత్తం బలయ్యింది. కారు అదుపుతప్పి రోడ్డుపక్కన పెద్ద గుంతలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.