Maruti Suzuki Baleno Down Payment and EMI Calculator: భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ‘మారుతి బాలెనో’ ఒకటి. కంపెనీ జూన్‌లో 14,077 యూనిట్లను విక్రయించింది. మారుతి బాలెనో ఒక ప్రీమియం కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్. సరసమైన ధర, మంచి మైలేజ్, సూపర్ లుక్, సౌకర్యవంతమైన ఇంటీరియర్ కారణంగా ఇది సక్సెస్ అయింది. బాలెనో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ గత సంవత్సరం రిలీజ్ అయింది. అందులో అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. అప్పటినుంచి ఈ కారు అమ్మకాలు మరింత పెరిగాయి. మారుతి బాలెనోను మీరు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. రూ 1.5 లక్షలు చెల్లించి ఇంటికి తీసుకెళిపోవచ్చు.
మారుతి బాలెనో బేస్ వేరియంట్ సిగ్మా. దీని ధర రూ. 6.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). మీరు ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే.. ఢిల్లీలో ఈ కారు ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 7.44 లక్షలు. హైదరాబాద్‌లో కూడా దాదాపుగా ఈ రేటే ఉండనుంది. ఈ కారుని కొనాలంటే మీరు రూ. 1.5 లక్షలను డౌన్ పేమెంట్‌గా చెల్లించవచ్చు. రూ.1.5 లక్షల డౌన్ పేమెంట్‌తో ఈ కారును కొనుగోలు చేస్తే.. రూ. 5.94 లక్షల రుణం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రుణాన్ని 5 సంవత్సరాల పాటు, వడ్డీ రేటు 9.8 శాతం అయితే మీరు మొత్తం రూ. 7.54 చెల్లించాలి. ఇందులో రూ. 1.59 లక్షల వడ్డీ అవుతుంది. మీ ఈఎంఐ రూ. 12,570గా ఉంటుంది.
Also Read: Umpire Nitin Menon: బెయిర్‌స్టో తప్పిదం.. పసిగట్టిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్
5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ జతచేయబడిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (90PS/113Nm) మారుతి బాలెనోలో ఉంటుంది. ఇది సీఎన్జీ మోడ్‌లో 77.49PS మరియు 98.5Nm ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్‌లో ఇప్పటికే ఉన్న మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీకి బదులుగా ఐడిల్-స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా జోడించబడింది.
మారుతి సుజుకి బాలెనో 360-డిగ్రీ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, వెనుక ఏసీ వెంట్స్, ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్‌వ్యూ కెమెరా, వైర్‌లెస్ వంటి అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఛార్జర్ మరియు క్రూయిజ్ నియంత్రణ కూడా ఇందులో ఉంటుంది.