Third Umpire Nitin Menon’s Steve Smith Run-Out Decision Goes Viral After Jonny Bairstow Hits Bails: యాషెస్ సిరీస్ 2023లో వివాదాల పర్వం కొనసాగుతోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ 2023లో ఇప్పటికే ఎన్నో వివాదాలు చోటుచేసుకోగా.. ఐదో టెస్ట్‌లో మరో వివాదం చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇచ్చిన నిర్ణయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అంపైర్ నిర్ణయంపై ఇంగ్లండ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా ఫాన్స్ అయితే మంచి నిర్ణయం అంటూ అంపైర్‌ను ప్రశంసిస్తున్నారు. అంపైర్ నితిన్ మీనన్ చాకచాక్యంతో.. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తృటిలో రనౌటయ్యే అవకాశం నుంచి తప్పించుకున్నాడు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా క్రిస్ వోక్స్ 78వ ఓవర్ వేశాడు. మూడో బంతికి స్టీవ్ స్మిత్ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. స్మిత్ సింగిల్ పూర్తి చేసుకుని.. రెండో రన్ కోసం పరిగెత్తాడు. బంతిని అందుకున్న ఇంగ్లండ్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జార్జ్ ఎల్‌హామ్.. మెరుపు వేగంతో వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో వైపు విసిరాడు. బంతిని అందుకున్న బెయిర్‌స్టో రెప్పపాటులో బెయిల్స్ పడగొట్టాడు. అద్భుతంగా డైవ్ చేసిన స్మిత్ కూడా తాను ఔట్ అని భావించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.
రనౌట్ కోసం ఫీల్డ్ అంపైర్ విల్సన్.. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్‌కు రీఫర్ చేశాడు. రీప్లేలో బంతి వికెట్లకు తాకే సమయానికి స్టీవ్ స్మిత్ క్రీజులోకి రాలేదు. దాంతో అందరూ స్టీవ్ స్మిత్ ఔట్ అని భావించారు. స్మిత్ కూడా తను ఔటని భావించి.. పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. అయితే థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ పలు కోణాల్లో పరిశీలించి.. బెయిర్‌స్టో బంతిని అందుకోక ముందే గ్లోవ్‌తో ఒక బెయిల్‌ను పడగొట్టినట్లు తేల్చాడు. మరో బెయిల్ కింద పడినప్పటికీ స్మిత్ క్రీజులోకి వచ్చేశాడని పేర్కొన్నాడు. స్మిత్‌ను నాటౌట్ అని ప్రకటించాడు. చూసిన ఇంగ్లండ్ ఆలయర్స్ షాకయ్యారు.
స్టీవ్ స్మిత్ నాటౌట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ అభిమానులు మాత్రం స్మిత్ ఔటే అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. స్మిత్‌ను నాటౌట్‌గా ప్రకటించినా ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎలాంటి ఆర్గ్యూ చేయకుండా వెళ్లిపోయారు అని ఫాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు థర్డ్ అంపైర్ నితిన్ మీనన్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 295 పరుగులకు ఆలౌటైంది. స్మిత్ 75 పరుగులు చేశాడు.
Also Read: Yusuf Pathan Fifty: యూసఫ్ పఠాన్ విధ్వంసం.. 14 బంతుల్లోనే 61 రన్స్! చుక్కలు చూసిన పాక్ బ్యాటర్
George Ealham 🤝 Gary Pratt
An incredible piece of fielding but not to be… 😔 #EnglandCricket | #Ashes pic.twitter.com/yWcdV6ZAdH
— England Cricket (@englandcricket) July 28, 2023