ఈడీ, ఐటీ దాడులు అనంతరం నాగర్ కర్నూల్‌కి మొదటిసారి ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాజిపేట మండలం మరికల్ దగ్గర కార్ల ర్యాలీగా ఎమ్మెల్యే కి స్వాగతం పలికారు బీఆర్ఎస్ శ్రేణులు. జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ ఎదుట ఎమ్మెల్యేకి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా నేను వ్యాపారంలో ఉన్నానని, మూడుసార్లు ఈ దాడులు జరిగినా.. మూడు సార్లు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. రాజకీయ కక్షల తోనే ఈ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Guntur Kaaram: థమన్ ఉన్నాడు కానీ పూజా ఔట్.. అసలు కారణం అదేనట?
అంతేకాకుండా.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్థానికంగా పలుకుబడి లేదని, నాయకత్వ లోపం వుందన్నారు. ప్రజల్లో బలంగా మంచి పేరు ఉన్న వ్యక్తులను బీజేపీ టార్గెట్ చేస్తుందని, భయపెట్టి వారినీ పార్టీలోకి తీసుకోవాలని ఉద్దేశంతో ఈ దాడులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొంతమంది కావాలనే నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Asia Fencing Championship: రికార్డు సృష్టించిన ఫెన్సర్ భవానీ.. ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో కాంస్యం
నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి పై ఒకరైతే గెలవమని ఇద్దరు ఏకమవుతున్నారని ఆయన అన్నారు. తొమ్మిదేళ్లుగా నాగర్ కర్నూల్ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆయన వెల్లడించారు. ఇక్కడి నేతలకు 75 ఏళ్లు వచ్చినాయి, నడవనిక మాత్రం మారడం లేదని, అయినా మరో ఒకరిని కలుపుకొని ముందుకు వస్తున్నారన్నారు. ఇద్దరికీ వయస్సు వచ్చింది.. మనువళ్లతో ఆడుకోవాలన్నారు. నన్ను ఈ మూడునెలలు కాపాడుకోండని, నేను మళ్ళీ గెలిచి ఇంజనీరింగ్ కాలేజీ తెస్తానని కేడర్‌కు పిలుపునిచ్చారు. మళ్ళీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవుతాడు నాగర్ కర్నూల్ లో మర్రి జనార్థన్ రెడ్డి మంత్రి అవుతాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.