Pooja Hegde steps out of Guntur Kaaram: మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉంది. ఆసక్తికరంగా ఈ సినిమా నుంచి అసలు ఎందుకు పుట్టుకొచ్చిందో ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు కానీ థమన్ తప్పుకుంటున్నాడని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ కు అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయంటూ ఒక పుకారు తెరమీదకు వచ్చింది. ఇంకేముంది థమన్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తప్పిస్తున్నారని వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దెబ్బకి అది నిజం కాదని స్వయంగా నిర్మాత క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది అలా సద్దుమణిగిందో లేదో ఇప్పుడు మరో వార్త తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే ఈ సినిమా తప్పు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Leo Naa Ready: దుమ్మురేపుతున్న విజయ్ లియో ‘నా రెడీ’ ప్రోమో
ఆమె స్థానంలో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ అవుతుందని సెకండ్ హీరోయిన్ గా మరో హీరోయిన్ ని రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి పూజా హెగ్డే బాలీవుడ్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాలకు ఈ సినిమాలకు డేట్స్ కుదరడం లేదు, గుంటూరు కారం సినిమా షూటింగ్ రెండుసార్లు వాయిదా పడేందుకు పూజా హెగ్డే కారణమైందని, ఎంత ప్రయత్నించినా ఆమె డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమెను తప్పించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక అయితే ఇందులో నిజానిజాలు ఎంత వరకు ఉన్నాయనేది కాలమే నిర్ణయించాలి. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈనెల 24 లేదా 25వ తేదీన ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సినిమాని జనవరి 13వ తేదీన రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల మీద నాగవంశీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.