పోలీసు ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఛత్తీస్ ఘడ్-దంతెవాడ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామస్థుడిని పోలీసు ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేసిన మావోయిస్టులు. పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో గ్రామస్తుడిని హతమార్చారు. గ్రామస్తుడి హత్య అనంతరం ఆ మృతదేహాన్ని మాలేవాహి చౌక్‌లో రహదారిపై వదిలి వెళ్ళిపోయారు మావోయిస్టులు. హత్యకు సంబంధించి ఘటన స్థలంలో కరపత్రాలు వదిలి వెళ్ళిపోయారు మావోయిస్టులు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వ్యక్తిని జై రామ్ కశ్యప్ గా గుర్తించారు. రెండు రోజుల క్రితం స్వగ్రామం కచనార్ వెళ్లిన క్రమంలో అపహరించుకు వెళ్ళి అనంతరం హత్య చేశారు మావోయిస్టులు. మలేవాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
కరెంట్ షాక్ తో గజరాజు మృతి

ఒకవైపు గ్రామాలపై దాడులు చేస్తే భయభ్రాంతులకు గురిచేస్తున్న గజరాజులు కరెంట్ షాక్ తో కన్నుమూస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో కరెంట్ షాక్ తో మరో ఏనుగు ఏనుగు మృతిచెందింది. బంగారుపాళ్యం మండలం కీరమంద, కొల్లదమడుగు అటవీ ప్రాంత వ్యవసాయ భూముల్లో బోరు మోటర్ నోటితో తగలడంతో విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. ఏనుగు నోటిలో విద్యుత్ తీగలు ఇరుక్కుపోయాయి. ఏనుగు మృతిని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు.
Read Also:Gold Seize At RGIA: నీ ఒళ్ళు బంగారం గానూ.. ఎయిర్ పోర్టులో గోల్డ్ సీజ్