Mansoor Ali Khan discharged from Hospital: సినీ నటుడు, వేలూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంకు బుధవారం చివరిరోజు కావడంతో.. ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనయ్యాడు. కార్యకర్తలు మన్సూర్‌ను వెంటనే గుడియాత్తంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆపై చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందిన మన్సూర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది.
మన్సూర్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయ్యారని సమాచారం. ఎన్నికల నేపథ్యంలో వేలూరు లోక్‌సభ నియోజకవర్గంకు ఆయనకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే తనకు పండ్ల రసంలో ఎవరో విషం కలిపి ఇచ్చారని మస్సూర్ ఓ ప్రకటన విడుదల చేశారు. గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు దారిలో కొందరు తనకు పండ్ల రసం, మజ్జిగ ఇచ్చారన్నారు. పండ్ల రసం తాగిన కొద్ది నిమిషాలకే తనకు కళ్లు తిరిగి గుండెల్లో నొప్పి వచ్చిందని మన్సూర్ పేరొన్నారు. ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత కోలుకున్నానని మన్సూర్ చెప్పారు.
Also Read: PBKS vs MI: సూర్యుడు రేపు ఉదయించినట్లే.. మేం విజయాలు సాధిస్తాం: సామ్
మన్సూర్ అలీ ఖాన్‌కు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారట. కానీ ఆయన మాత్రం తాను విశ్రాంతి కోరుకోవడం లేదని చెప్పారట. ఈరోజు లోక్‌సభకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వేలూరు నియోజకవర్గానికి మన్సూర్ వెళ్లారట. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున నిన్ననే డిశ్చార్జి చేయాల్సిందిగా వైద్యులు ఆయన కోరారట. గురువారమే మన్సూర్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వేలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్సూర్‌కు జాక్‌ఫ్రూట్ గుర్తును కేటాయించారు.