అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీలో ఏమైనా విభేదాలు, పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలని సూచించారు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.
SC Categorisation: షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మళ్లీ తెరమీదికి రాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమలైన ఏబీసీడీ వర్గీకరణ 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో నిలిచిపోయింది. సుప్రీంకోర్టు బ్రేక్ వేయటమే దీనికి ప్రధాన కారణం.
తెలంగాణ కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుల వాయిస్ పెరిగిందా..? పీసీసీ లక్ష్యంగా ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? ఆ వ్యాఖ్యల వెనక ఏదైనా వ్యూహం ఉందా? లేక పార్టీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహారం నడిపించారా? రేవంత్ అందుబాటులో ఉండటం లేదని డీసీసీల ఫిర్యాదుతెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ సభ్యత్వాలు చేయించాలని చెబుతుంటే..! సరే.. మా సంగతేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నల వెనక వ్యూహం ఏంటి? జిల్లాలలో ఉన్న అసంతృప్తిని పీసీసీ దృష్టికి…