Couple Friendly: ప్రభాస్ పుష్ గట్టిగా పని చేసినట్టుందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సృష్టించే సంచలనాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ ఏడాది అలాంటి ఒక అద్భుతాన్ని ‘కపుల్ ఫ్రెండ్లీ’ అని సినిమా ఆవిష్కరిస్తోంది. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయిన ఈ ప్రేమకథ, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో 12.67 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం సెకండ్ వీక్ లో “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణ సొంతం చేసుకుంటోంది. సెకండ్ వీక్ రన్ పూర్తయ్యే సరికి బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్ ను “కపుల్ ఫ్రెండ్లీ” క్రియేట్ చేయబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది.
Also Read:Allu shirish-Ram Charan:మాలలో పార్టికి చరణ్? విమర్శకులకు దిమ్మతిరిగే ఇచ్చిన అల్లు శిరీష్..
Also Read
అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు. ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూస్తుంటే, ప్రేక్షకులకు కంటెంట్ నచ్చితే బడ్జెట్‌తో సంబంధం లేదని మరోసారి నిరూపితమైంది. ఈ సీజన్‌లోనే ‘బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ’గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా విజయంలో రెబల్ స్టార్ ప్రభాస్ సహకారం మరువలేనిది. సాధారణంగా పెద్ద సినిమాలకే పరిమితమయ్యే ప్రభాస్, ఈ చిన్న చిత్రంపై ఉన్న నమ్మకంతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించి సినిమాను ప్రమోట్ చేశారు. చిత్ర యూనిట్‌తో ప్రభాస్ జరిపిన ఆ ముచ్చట్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్ మద్దతు తెలపడంతో, సామాన్య ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీల దృష్టి కూడా ఈ సినిమాపై పడింది. యువత ఈ సినిమాలోని భావోద్వేగాలకు, నేటి తరం రిలేషన్ షిప్ అంశాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. పాజిటివ్ టాక్, మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాను లాంగ్ రన్‌లోకి తీసుకెళ్లేలా కనిపిస్తున్నాయి.
- Tags
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!