Manoj Bajpayee: బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీలో ఆయన మంచి సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా, విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో సైతం నటించి పూర్తిస్థాయి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు మనోజ్.. తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ ఇంటర్వ్యూలో పంచుకున్నదే లేదు. ఇక తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టారు. మనోజ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు దాటింది. అప్పుడు మనోజ్ ఎలా ఉన్నాడో .. ఇప్పటికీ అలాగే సన్నగా ఉన్నాడు. అదే ప్రశ్న ఆయనకు ఎదురైనప్పుడు.. ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ మనోజ్ బయట పెట్టాడు.
Anasuya: ఓ.. ఆంటీ.. నిన్ను పబ్లిక్ ఫిగర్ ను చేసిందే.. మీడియా.. అది మర్చిపోకు
మీరో అప్పటికీ, ఇప్పటికీ ఒకేలా ఉన్నారు.. డైట్ ఏం ఫాలో అవుతారు అన్న ప్రశ్నకు మనోజ్ మాట్లాడుతూ.. ” నేను 13, 14 ఏళ్ళ నుంచి రాత్రి పూట భోజనం చేయడం మానేశాను. దీనివలన నా బరువు అదుపులో ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు ఒకేలా ఉంటాను. మొదట్లో కష్టం అనిపించినా.. ఆ తరువాత అలవాటు అయిపోయింది. ఇది మా తాతగారు నాకు నేర్పించారు. ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా, ఉత్సహంగా ఉండేవారు. అలా నేను కూడా ఇప్పుడు ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండగలుగుతున్నాను” అని చెప్పుకొచ్చాడు. దేవుడా ఒక్కరోజు అన్నం తినకుండా ఉంటేనే.. మనకు ఏదోలా ఉంటుంది..అలాంటింది ఇన్నేళ్లు ఇలా ఒక్క పూట భోజనం చేస్తూ ఎలా ఉంటున్నావయ్యా అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో మనోజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.