Manikrao Thakre: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు లేవు.. సర్దుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ప్రజల సొమ్మును కేసీఆర్ దోపిడీ చేశారని ఆరోపించారు. దోపిడీ సొమ్ముతో మహారాష్ట్రలో కేసీఆర్ తన పార్టీని విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
Also Read: Congress Jana Garjana Meeting Live Updates : కాంగ్రెస్ ‘జనగర్జన సభ’ లైవ్ అప్డేట్స్
లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ ఓడిద్దామనుకుంటున్నారని.. కానీ అది సాధ్యం కాదన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని అందరికీ అర్థమైపోయిందన్నారు. ఖమ్మం సభలో రాహుల్ గాంధీ పాల్గొంటుండడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊపు తెస్తుందని మాణికే ఠాక్రే పేర్కొన్నారు. ఖమ్మంలో భారీ సభ జరగుతోందన్నారు. భట్టి పాదయాత్ర ముగిసిందని తెలిపిన ఠాక్రే.. అలాగే చేరికలు ఉన్నాయని తెలిపారు. ఇచ్చిన హామీలు కేసీఆర్ నేరవేర్చలేదని ఆయన విమర్శించారు.