బీజేపీకి తెలంగాణ అండగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్రకు కొనసాగింపే ఈ పీపుల్స్ మార్చ్ యాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పాదయాత్రలో అందరి కష్టాలను తెలుసుకున్నామని ఆయన తెలిపారు. పీపుల్స్ మార్చ్‌ను ఆదిలాబాద్ నుంచి ప్రారంభించామని భట్టి పేర్కొన్నారు.
ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్.. గతానికి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్షన్‌తో పలువురిని పార్టీలోకి రప్పించే పనిలో ఉండగా... పొంగులేటి, జూపల్లితో పాటు ఇతర నేతలను పార్టీలోకి రప్పించటంలో విజయవంతం అయింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు లేవు.. సర్దుకున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ ఠాక్రే స్పష్టం చేశారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని.. కేసీఆర్ వ్యవహరం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.