IND vs ENG Dream11 Team Prediction Today Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న భారత్.. నేడు ఇంగ్లండ్‌ను ఢీ కొట్టనుంది. ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ గెలిచి ఆరో విజయంపై భారత్ దృష్టి పెట్టింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రోహిత్ సేనకు సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. మరోవైపు భారత్‌ను మించి హాట్ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఘోరమైన ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయిదు మ్యాచ్‌ల్లో ఒకటే విజయం.. అది కూడా బంగ్లాదేశ్‌పై ఇంగ్లీష్ జట్టు గెలిచింది. అఫ్గానిస్థాన్, శ్రీలంక లాంటి చిన్న జట్ల చేతుల్లో ఓటమి పాలైన ఇంగ్లండ్.. టీమిండియాకు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.
భారత్‌కు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో పెద్ద సమస్యలు లేవు. రోహిత్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్ నిలకడగా రాణిస్తుండడం కలిసొచ్చే అంశం. గిల్ మంచి లయతో కనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో బుమ్రా, కుల్దీప్, జడేజా, సిరాజ్ సత్తా చాటుతున్నారు. గత మ్యాచ్‌లో అవకాశం దక్కించుకున్న షమీ కూడా అదరగొట్టాడు. వీళ్లందరూ జోరును కొనసాగిస్తే ఇంగ్లండ్‌ను ఓడించడం కష్టమేమీ కాదు. అయితే ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరమవడంతో.. భారత్ ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. లక్నో పిచ్ స్పిన్నర్లకు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో మూడో స్పిన్నర్‌గా ఆర్ అశ్విన్‌ను తీసుకునే అవకాశం ఉంది.
ప్రపంచకప్ 2023 ముందు వరకు అన్ని జట్లనూ భయపెట్టిన ఇంగ్లండ్‌కు అన్నీ కలిసొస్తే ఆ జట్టు ఆటతీరే మారిపోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్ జట్టును తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికే సెమీస్ అవకాశాలు సన్నగిల్లడంతో.. ఈ మ్యాచ్‌లో తెగించి ఆడే అవకాశముంది. మలన్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్, లివింగ్‌స్టన్‌లు తనదైన చెలరేగగలరు. బౌలింగ్‌లో వుడ్, వోక్స్ ఆ జట్టును ఆదుకోనున్నారు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, అశ్విన్/సిరాజ్, బుమ్రా, షమీ.
ఇంగ్లండ్: మలన్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్ (కెప్టెన్), లివింగ్‌స్టన్, బ్రూక్/అలీ, రషీద్, విల్లీ, వోక్స్, వుడ్/అట్కిన్సన్.
డ్రీమ్ 11 టీమ్:
వికెట్ కీపర్: కేఎల్ రాహుల్
బ్యాటర్లు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), బెన్ స్టోక్స్, జో రూట్
ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ విల్లీ
బౌలర్లు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్ ), మహ్మద్ షమీ, ఆదిల్ రషీద్