Pune Bank Robbery: బురఖాలో వచ్చి.. గప్ చిప్‌గా పని కానిచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune Bank Robbery: పుణెలోని మన్ పాడలోని ఐసీఐసీఐ బ్యాంకులో భారీ రాబరీ చోటుచేసుకుంది. దాదాపు 12కోట్ల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. బురఖాలో వచ్చి గప్ చిప్ గా పని కానిచ్చేశారు. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులు కేసును చేధించారు. ముంబైకి చెందిన షేక్…. ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్ గా పని చేశాడు. కస్టోడియన్ అంటే లాకర్ తాళాలకు కేర్ టేకర్ గా ఉండే వాడు. బ్యాంకులో ఉన్న నగదు చూసి అతనికి బుద్ధి పక్కదారి పట్టింది. ఎలాగైనా సొమ్మును తస్కరించాలని గత ఏడాదిగా ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో సిస్టంలోని లూప్ హోల్స్ ని గమనించాడు. అలాగే సీసీటీవీ ఫుటేజీని ట్యాంపరింగ్ చేసి, ఏసీ డక్ట్ ద్వారా మొత్తం దోపిడీని ప్లాన్ చేశాడు.
తనను ఎవరూ గుర్తించకుండా బురఖా వేసుకొని మరీ నగదు దోచేశాడు. ఈ వ్యవహారంలో సహకరించిన షేక్ సోదరి నీలోఫర్ తో పాటు మరో ముగ్గురు నిందితులు అబ్రార్ ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరిను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అల్తాఫ్ షేక్ ను పుణెలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు బుధవారం విచారణ అధికారి వెల్లడించారు. అతడి నుంచి 9 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం థానే, నవీ ముంబై పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి షేక్ ను అరెస్ట్ చేశారు.
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
Read Also: Kejriwal : ‘నా భార్య కూడా నన్నింతలా తిట్టలేదు’ – సీఎం
చోరీ జరిగిన విధానం చూస్తే సినిమాల్లో చూపించిన విధంగానే ఉందంటున్నారు పోలీసు అధికారి. అలారం సిస్టమ్ ను డీఆక్టివేట్ చేసి, సీసీటీవీని ధ్వంసం చేసిన తర్వాత షేక్ బ్యాంక్ ఖజానాను తెరిచి నగదును కట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఏడాది జులై 12వ తేదీన చోరీ జరిగింది. అయితే డీవీఆర్ సెక్యూరిటీ డబ్బు కూడా కనిపించకుండా పోయిందని సిబ్బంది గ్రహించడంతో ఈ సంఘట వెలుగులోకి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు షేక్ ను అరెస్ట్ చేసి చోరీకి గురైన మొత్తం 12.20 కోట్లతో సుమారు 9 కోట్లను రికవరీ చేయగలిగారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని చప్పారు. ఈ కేసులో మరింత మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని అధికారి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!