Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
- ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో పేలుడు
- భారతీయుల సహా 13 మంది మృతి
- కుట్ర కోణం లేదన్న ఖతార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో భారతీయులు సహా 13 మంది మృతి చెందగా.. 66 మందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఖతార్‌లోని అతిపెద్ద సహజ వాయువు (LNG) సముదాయాల్లో ఒకటైన రాస్ లాఫాన్ గ్యాస్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన భారీ పేలుడు విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో భారతీయులు, పాకిస్థానీయులు సహా మొత్తం 13 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 66 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్-కాబీ అధికారికంగా వెల్లడించారు.
Also Read
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్‌పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన… “నేను ఎప్పుడూ చెప్పకూడదని ఆశించిన ఒక విషాదకరమైన వార్తను ప్రకటించాల్సి వస్తోంది. భారతీయ, పాకిస్థానీ జాతీయత కలిగిన 13 మంది ప్రాణాలు కోల్పోయారు” అని తెలిపారు. అయితే మృతుల్లో ఎంతమంది భారతీయులు ఉన్నారనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.
ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇరాన్ క్షిపణి దాడి కారణంగా ప్లాంట్ కార్యకలాపాలు నిలిపివేశారు. మరమ్మతుల అనంతరం కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన 66 మందికి చికిత్స అందిస్తున్నామని, వారిలో ఎవరి పరిస్థితి కూడా ప్రాణాపాయంగా లేదని మంత్రి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఖతార్ అధికారులు దీనిని ‘సాంకేతిక ప్రమాదం’గా అభివర్ణించారు. బార్జాన్ గ్యాస్ సరఫరా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రమాదం కారణంగా ఖతార్ గ్యాస్ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం ఉండదని ఖతార్ ఎనర్జీ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలకు గ్యాస్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని మంత్రి సాద్ అల్-కాబీ తెలిపారు. “ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన మాత్రమే. ఇందులో ఎలాంటి విధ్వంసక చర్యలు లేదా శత్రుదాడి కోణం లేదు” అని స్పష్టం చేశారు. పేలుడు ప్లాంట్‌లో ఏ ప్రాంతంలో సంభవించింది? ఎంత మేర నష్టం జరిగింది? అనే విషయాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
బార్జాన్ ప్లాంట్ రోజుకు సుమారు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ల గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఖతార్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్రపు నీటిని తాగునీటిగా మార్చే డీసాలినేషన్ ప్లాంట్ల నిర్వహణకు ఈ గ్యాస్ కీలకంగా ఉపయోగపడుతోంది. గత మార్చిలో కూడా రాస్ లాఫాన్ సముదాయంపై ఇరాన్ క్షిపణి దాడి జరగగా.. ఆ ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి గణనీయమైన నష్టం వాటిల్లింది. తాజాగా మరోసారి జరిగిన పేలుడు ఖతార్ ఇంధన రంగంలో ఆందోళన కలిగిస్తోంది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
-
Samsung Galaxy A18 4G: సామ్ సంగ్ గెలాక్సీ A18 4G.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు లీక్
-
Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌కు 2026లో వరుస షాక్‌లు.. ఆ ఒక్క హిట్ తర్వాత ఎందుకిలా?
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Telangana Assembly 2026: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 20 అంశాలపై చర్చకు బీఆర్ఎస్ డిమాండ్.. కేసీఆర్ వస్తారా?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!