Sachin Tendulkar Viral Video: వర్షంలో చిన్నపిల్లాడిగా మారిపోయిన సచిన్.. వైరల్‌గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sachin Tendulkar Viral Video: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోసారి సోషల్ మీడియాలో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. ఈసారి తన పెంపుడు కుక్క ‘బౌన్సర్’తో కలిసి వర్షంలో సరదాగా గడిపిన క్షణాలను పంచుకుంటూ చేసిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వీడియోలో సచిన్ తన పెంపుడు కుక్కతో కలిసి వర్షంలో ఆడుకుంటూ కనిపించగా, వారి మధ్య ఉన్న అనుబంధం అభిమానులను ఆకర్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో బౌన్సర్ ఉత్సాహంగా పరుగులు తీస్తూ కనిపించగా, సచిన్ కూడా చిన్నపిల్లాడిలా దానితో ఆడుకుంటూ ఆనందించారు. వర్షపు చినుకుల్లో ఇద్దరూ సరదాగా గడిపిన క్షణాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే, వీడియో కంటే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది సచిన్ రాసిన క్యాప్షన్. తన కుక్క పేరును క్రికెట్ పదజాలంతో ముడిపెడుతూ, “ఈ బౌన్సర్లో అపారమైన శక్తి ఉంది.. కానీ దీనికి అస్సలు లైన్ అండ్ లెంగ్త్ లేదు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ చమత్కారమైన వ్యాఖ్య అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. పోస్ట్‌కు వేలాది లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 50 ఏళ్ల వయసులో కూడా చిన్నపిల్లాడిలా ఆనందించడం సచిన్‌కే సాధ్యమని అభిమానులు ప్రశంసిస్తున్నారు. జంతువులపై సచిన్‌కు ఉన్న ప్రేమ మరోసారి ఈ వీడియో ద్వారా స్పష్టమైందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా తన వ్యక్తిగత జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ సచిన్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. తాజాగా బౌన్సర్‌తో పంచుకున్న ఈ వీడియో కూడా చిన్న చిన్న ఆనందాలే జీవితాన్ని అందంగా మార్చుతాయనే సందేశాన్ని అందిస్తోంది.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!