Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gade Sai Krishna Missing Case: విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ సంయుక్త కార్యదర్శి దాడిశెట్టి వీరబాబు సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సాయికృష్ణ మరణానికి సంబంధించిన అన్ని రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, హాస్పిటల్ రికార్డులు, పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు తదితర సాక్ష్యాలను వెంటనే భద్రపరచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. కేసు దర్యాప్తులో స్థానిక పోలీసులు, ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆయన ఆరోపించారు.
పోలీసు అధికారులపైనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో స్థానిక పోలీసుల ద్వారా జరిగే దర్యాప్తుపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, అందువల్ల స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న ఏ పోలీసు అధికారినీ దర్యాప్తులో భాగస్వామ్యం చేయకూడదని కూడా కోరారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావించిన పిటిషనర్, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశంపై సహేతుకమైన అనుమానం ఉన్నప్పుడు కేసులను సీబీఐకి బదిలీ చేసే అధికారం రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలకు ఉందని పేర్కొన్నారు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
అలాగే సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత తీవ్ర హింసకు గురిచేశారని, అనంతరం మరణించినట్లు చూపకుండా ఆధారాలను మాయం చేసే ప్రయత్నాలు జరిగాయని పిటిషన్లో ఆరోపించారు. అయితే ఇవన్నీ పిటిషనర్ చేసిన ఆరోపణలేనని, వాటిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కేసు విచారణ పూర్ణయ్యే వరకు సంబంధిత ఆధారాలు ధ్వంసం కాకుండా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, అనంతరం దర్యాప్తును పూర్తిగా సీబీఐకి అప్పగించాలని హైకోర్టును పిటిషనర్ అభ్యర్థించారు.
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?