Mega Surprise: మా ఇంటి బంగారానికి చిరు సత్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో, ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ క్రేజీ సక్సెస్ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ఒక అపురూపమైన మెగా సర్ప్రైజ్ లభించింది.
‘మా ఇంటి బంగారం’ సాధించిన ఈ అద్భుతమైన ప్రత్యేక విజయం పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ స్పందించారు. చిత్ర బృందం సాధించిన ఘనతను అభినందిస్తూ.. మెగాస్టార్ దంపతులు ‘మా ఇంటి బంగారం’ చిత్ర యూనిట్ మొత్తాన్ని ప్రత్యేకంగా కలిసి ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా కంటెంట్, సమంత నటన, నందిని రెడ్డి టేకింగ్ ఇలా ప్రతి ఒక్క అంశాన్ని వారు మెచ్చుకున్నట్లు సమాచారం. సమంతతో పాటు నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా పిక్చర్స్’ టీమ్‌కు మెగాస్టార్ దంపతుల నుండి లభించిన ఈ అప్రిసియేషన్ సినిమా రేంజ్‌ను మరింత పెంచిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చాలా కాలం తర్వాత వెండితెరపై సమంత పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి నుండి ఇలాంటి గ్రాండ్ సపోర్ట్ లభించడం చిత్ర యూనిట్లో సరికొత్త జోష్ నింపింది.
Also Read
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!