Mamata Banerjee: కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
- కోల్‌కతా హైకోర్టులో న్యాయవాది దుస్తుల్లో హాజరైన మమతా బెనర్జీ
- నల్ల లాయర్ గౌన్‌లో కనిపించిన మాజీ సీఎం ఫొటోలు వైరల్
- అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసు విచారణలో కోర్టు హాజరు
- రాజకీయ కార్యకర్తలపై దాడుల ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ (Mamata Banerjee) నేడు కోల్‌కతా హైకోర్టులో న్యాయవాది దుస్తుల్లో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నల్లని లాయర్ గౌన్ ధరించి కోర్టుకు వచ్చిన ఆమె ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బెంగాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఆమె కోర్టుకు హాజరయ్యారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన ఆ ఎన్నికల తర్వాత రాజకీయ కార్యకర్తలు, పార్టీ కార్యాలయాలపై దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది. సీనియర్ టీఎంసీ నేత, న్యాయవాది కళ్యాణ్ బనెర్జీ కుమారుడు శీర్షణ్య బందోపాధ్యాయ ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు సమాచారం. ఎన్నికల అనంతరం పలువురు కార్యకర్తలు లక్ష్యంగా మారారని, రాజకీయ ప్రతీకార చర్యలు జరిగాయని పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Also Read
- FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ఈ సందర్భంగా అల్ ఇండియా త్రిణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందించింది. బెంగాల్ ప్రజలకు అవసరమైన సమయంలో మమతా బెనర్జీ ఎప్పుడూ అండగా నిలుస్తారని.. నిజం, న్యాయం, రాజ్యాంగ విలువల కోసం ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పార్టీ పేర్కొంది. అలాగే ద్వేష రాజకీయాలకు అతీతంగా ఆమె కరుణ, ధైర్యం, నిబద్ధతతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించింది. బీజేపీ అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె ఎప్పటికప్పుడు పోరాడుతున్నారని కూడా పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిశీలనలో ఉండగా, రాబోయే రోజుల్లో మరిన్ని విచారణలు జరగనున్నాయి. కోల్‌కతా హైకోర్టు ఈ ఆరోపణలపై తదుపరి విచారణ చేపట్టనుంది.
Our Hon’ble Chairperson Smt @MamataOfficial personally reached the Calcutta High Court today to argue in a matter concerning the widespread post-poll violence unleashed across Bengal by @BJP4Bengal.
Once again, she has shown what truly sets her apart –
She NEVER abandons the… pic.twitter.com/8OkszMxaYa
— All India Trinamool Congress (@AITCofficial) May 14, 2026
తాజావార్తలు
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
-
Basil Joseph: అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!