కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. అయితే.. ప్రియాంకా గాంధీ రాక నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పొలిటికల్ టూరిస్టులు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న మీ నేతలు కూడా పొలిటికల్ టూరిస్టులేనా? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Vijay Devarakonda: ‘మేమ్ ఫేమస్’… అందుకే ముందే వస్తున్నాం!
ప్రియాంకా గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. రేవంత్ రెడ్డిని గాడ్సే అనడం సరికాదని, వెంటనే ప్రియాంకా గాంధీకి, రేవంత్ రెడ్డికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ కేసులో సిట్ రిపోర్ట్ ఇవ్వకముందే అందులో ఇద్దరే ఉన్నారని కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేటీఆర్ రాజ్యాంగేతర శక్తిగా మారారన్నారు మల్లు రవి.
Also Read : Fake Insurance Gang : నకిలీ ఇన్సూరెన్సు ముఠా గుట్టు రట్టు.. వీళ్ల తెలివి తగలెయ్య..