45 ఏళ్ల రాజకీయ జీవితం తనదని పొన్నాల అన్నారు. 45 ఏండ్ల తర్వాత ఈ చర్య బాధాకరంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియంది కాదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని పొన్నాల కంటతడి పెట్టారు. పేద కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు. వరుసగా మూడు సార్లు గెలిచిన బీసీ నేతను అయినా.. పార్టీలో అవమానం కలిగిందని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్‌లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఖర్గే పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్‌రావ్ థాక్రే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. శనివారం అక్కడ జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం జైపూర్‌లో కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమి (INDIA) పేరుపై వివాదాన్ని చర్చించడానికి ప్రధాని మోడీ ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌ను ప్రకటించాడన్నారు.