Guntur Kaaram Song Kurchi Madathapetti Promo Out: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. యువ హీరోయిన్ శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గుంటూరు కారం సినిమా 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది.
ప్రమోషన్స్‌లో భాగంగా గుంటూరు కారం సినిమా నుంచి మాస్ సాంగ్ ‘కుర్చీ మడతపెట్టి’ ప్రోమోను చిత్ర యూనిట్ నేడు విడుదల చేసింది. ఈ ప్రోమోలో మహేశ్ బాబు, శ్రీలీల డాన్స్ ఇరగదీశారు. ప్రస్తుతం ‘కుర్చీ మడతపెట్టి’ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ప్రోమో చూసిన మహేష్ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘మహేష్ అన్న ఇదరగదీశాడు’ అని కామెంట్స్ చేస్తున్నారు. సర్కారివారి పాట, సరిలేరు నీకెవ్వరూ సినిమాలలో మాస్ సాంగ్‌లకు మించి ఈ సాంగ్ ఉంటుందని ట్వీట్స్ చేస్తున్నారు.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన మాస్ స్ట్రైక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్స్ కూడా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.