సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇంచార్జీల సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డా.మహేంద్ర నాథ్ పాండే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో ముందు వరుసలో ఉందన్నారు. ఏటా పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం బీజేపీనేనని, కిసాన్ మోర్చా ముద్ర యోజన ఇతర ఇతర స్కీముల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారన్నారు. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం అందుకున్న రైతులు లక్ష 65 వేల పైచిలుకు ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాక ముందుకు ఆరు రాష్ట్రాల్లో బీజేపీ పాలించేదని ఇప్పుడు ప్రస్తుతం 18 రాష్ట్రాల్లో బీజేపి ప్రభుత్వం నడుస్తుందని, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని 1150 కోట్ల ధాన్య కొనుగోలు విషయంలో అవినీతి చేశాడని తక్షణం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు.
Also Read : Tunisha Sharma Suicide Case: టీవీ నటి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. కీలకంగా మారిన సీసీ టీవీ పుటేజ్
బీజేపీ పాలిత రాష్ట్రాలను చూసి కేసిఆర్ భయపడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ కుంభకోణదారులకు జైల్ కు పంపుతామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రతి స్కీంలో తన వాటాగా 60 శాతం నిధులు వెచ్చిస్తుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలు మావే ఆని చెప్పుకుంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి బీజేపీని ఆశీర్వదించాలని ప్రజలను వేడుకుంటున్నానన్నారు. విద్యాశాఖలోని 5 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని, గొప్పలు చెప్పే తెలంగాణ ప్రభుత్వం వెంటనే వాటిని భర్తీ చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి స్కీంలో 60 శాతం ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇది తమ పథకాలుగా చెప్పుకుంటుందన్నారు.