X Account Hack: హ్యాకర్ల టార్గెట్లు మామూలుగా లేవండీ బాబు.. వీళ్ల దుంపలు తెగ ఏకంగా ప్రభుత్వాలలో ముఖ్యుల సోషల్ మీడియా ఖాతాలపైనే దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. నేడు ఆసియా కప్‌లో భారత్- పాక్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హాకర్లు ఆయన ఎక్స్ ఖాతా నుంచి పాకిస్థాన్, తుర్కియే దేశాల జెండాలు ఉన్న పోస్టులను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటన చర్చనీయంశంగా మారింది.
READ ALSO: PM Modi: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ.. ఈ అంశాలపైనే మాట్లాడే అవకాశం..!
30-45 నిమిషాలు పట్టింది..
ఇటీవల ఉన్నతస్థాయి వ్యక్తుల సోషల్ మీడియా హ్యాండిల్స్ హ్యాకింగ్‌కు గురి కావడం తీవ్ర కలకలం రేపుతుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే ఎక్స్ అకౌంట్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆదివారం ఆసియా కప్‌లో భాగంగా భారత్- పాక్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శిందే ఎక్స్ అకౌంట్ నుంచి పాక్, తుర్కియే దేశాల జెండాలను పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. వెంటనే శిందే కార్యాలయం దీన్ని గుర్తించి అలర్ట్ అయ్యింది. వాళ్లు ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టిసారించి సుమారుగా 30 – 45 నిమిషాల తర్వాత అకౌంట్ తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చారని శిందే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతా నుంచి ఎలాంటి సున్నితమైన సమాచారం బయటకు వెలువడలేదని ఆయన కార్యాలయం వెల్లడించింది.