Gaddafi: లిబియా నియంత గడాఫీ కుమారుడు హత్య.. ఎవరు చంపారంటే..!
- దివంగత లిబియా నియంత గడాఫీ కుమారుడు హత్య
- సైఫ్ అల్-ఇస్లాం(53)ను చంపిన నలుగురు దుండగులు
- సన్నిహితులే చంపినట్లుగా సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత లిబియా నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్-ఇస్లాం(53) హత్యకు గురయ్యాడు. నలుగురు దుండగలు జరిపిన కాల్పుల్లో సైఫ్ అల్-ఇస్లాం మరణించాడు. రాజధాని ట్రిపోలికి నైరుతి దిశలో 136 కిలోమీటర్ల దూరంలో జింటాన్ పట్టణంలో హత్యకు గురయ్యాడు.
మంగళవారం సాయంత్రం సైఫ్ అల్-ఇస్లాంను ఆయన నివాసంలోని తోటలో కాల్చి చంపారు. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారని గడాఫీ కుటుంబానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:30 గంటలకు హత్య జరిగినట్లు పేర్కొన్నాయి. అయితే సన్నిహితులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సైఫ్ అల్-ఇస్లాం రాజకీయ సలహాదారుల్లో ఒకరైన అబ్దుల్లా ఒథ్మాన్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా మరణాన్ని ధృవీకరించాడు. ‘‘మనం దేవునికి చెందినవాళ్లం. ఆయన దగ్గరకే తిరిగి వెళ్లాము. సైఫ్ అల్-ఇస్లాం గడాఫీ దేవుని సంరక్షణలో ఉన్నాడు.’’ అని రాశాడు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
సైఫ్ అల్-ఇస్లాం..
2011లో నాటో మద్దతుతో జరిగిన తిరుగుబాటులో గడాఫీ పాలన అంతమైంది. అప్పటి నుంచి సైఫ్ అల్-ఇస్లాం ప్రముఖ రాజకీయ వ్యక్తిగా కొనసాగుతున్నాడు. తండ్రి మరణం తర్వాత దశాబ్దం పాటు ఒక మారుమూల కొండ పట్టణంలో బందిఖానాలో ఉన్నాడు. ఇక లిబియ అధ్యక్ష పదవికి పోటీ చేసే క్రమంలో విఫలయత్నం అయ్యాడు. పదవిలో లేనప్పటికీ నాలుగు దశాబ్దాలకు పైగా పాలించిన నిరంకుశ తండ్రి గడాఫీ తర్వాత చమురు సంపన్న ఉత్తర ఆఫ్రికా దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా సైఫ్ అల్-ఇస్లాం కొనసాగడం విశేషం.

సైఫ్ అల్-ఇస్లాం.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నాడు. ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాడు. తనకు తానుగా సంస్కర్తగా సమర్థించుకున్నాడు. అంతేకాకుండా పశ్చిమ దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించాడు. తిరుగుబాటు సమయంలో వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. ‘‘మేము ఇక్కడ లిబియాలో పోరాడుతున్నాము. ఇక్కడ లిబియాలోనే చనిపోతాము.’’ అని అన్నాడు. తిరుగుబాటుదారులు రాజధాని ట్రిపోలిని స్వాధీనం చేసుకున్న తర్వాత సైఫ్ అల్-ఇస్లాం బెడౌయిన్ తెగకు చెందిన వ్యక్తిలా దుస్తులు ధరించి పొరుగున ఉన్న నైజర్‌కు పారిపోవడానికి ప్రయత్నించాడు. అబూ బకర్ సాదిక్ బ్రిగేడ్ మిలీషియా అతన్ని ఎడారి మార్గంలో బంధించారు. తిరుగుబాటుదారులు అతని తండ్రిని వేటాడి కాల్చి చంపిన నెల తర్వాత పశ్చిమ పట్టణమైన జింటాన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Mohan Babu University: మోహన్‌బాబు, విష్ణును అరెస్ట్ చేయండి.. MBU గుర్తింపు రద్దు చేయండి.. విద్యార్థి సంఘాల డిమాండ్
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!