Dacoit : ధురంధర్ 2′ ఎఫెక్ట్.. అడివి శేష్ ‘డెకాయిట్’ ఏప్రిల్‌కు పోస్ట్‌పోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడివి శేష్ హీరోగా నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్‘. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా వేస్తూ ఈ ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు మార్చి నుండి విడుదల పోస్ట్ పోన్ చేస్తూ ఏప్రిల్‌కు వాయిదా వేసినట్టే కనిపిస్తోంది సిచుయేషన్. దీనికి ప్రధాన కారణం బాక్సాఫీస్ వద్ద నెలకొన్న పోటీయే అని తెలుస్తోంది.
Also Read : Varanasi OTT Deal : ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైజ్ కు ‘వారాణసి’ నెట్ ఫ్లిక్స్ డీల్..
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
మార్చి 19న బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తున్న ‘ధురంధర్ 2′ రిలీజ్ అవుతోంది. ఈ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. ‘ధురంధర్ 2’ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో స్క్రీన్స్ ఇస్తారు. ‘డెకాయిట్’ తెలుగుతో పాటు హిందీలోను రిలీజ్ అవుతుంది. అపుడు నార్త్ లోఈ చిత్రానికి సరైన సంఖ్యలో స్క్రీన్స్ దొరకడం కష్టమవుతుంది. అందుకే రిస్క్ తీసుకోకుండా సోలో రిలీజ్ కోసం ఏప్రిల్ నెలకు వెళ్లడమే ఉత్తమమని చిత్ర బృందం నిర్ణయించుకుంది. వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న అడివి శేష్ తన సినిమాల క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరు. ‘డెకాయిట్’ ఒక గ్రిప్పింగ్ యాక్షన్ లవ్ స్టోరీగా తీసుకువస్తున్నాడు. అందుకే పోటీగా వచ్చే బదులు సోలో రిలీజ్ బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఏప్రిల్ నెలలో సమ్మర్ సెలవులు కూడా తోడవుతాయి కాబట్టి, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఏప్రిల్‌లోని కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!