Varanasi OTT Deal : ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రైజ్ కు ‘వారాణసి’ నెట్ ఫ్లిక్స్ డీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS రాజమౌళి – మహేశ్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతోంది వారణాసి. కాగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ కి కారణం అయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 650 కోట్ల భారీ ఆఫర్‌ను మేకర్స్ ముందు ఉంచినట్లు సమాచారం. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు దక్కని భారీ ధర కావడం విశేషం.
Also Read : MEGA 158 : చిరు కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ సినిమా హీరోయిన్
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఈ భారీ డీల్‌లో భాగంగా ఒక ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా సినిమాలు విడుదలైన 4 నుంచి 6 వారాల్లో ఓటీటీలోకి వస్తుంటాయి. కానీ, ‘వారణాసి’ టీమ్ థియేట్రికల్ విండో చాలా ఎక్కువగా ఉండేలా చర్చలు జరుపుతోంది. అంటే సినిమా థియేటర్లలో విడుదలైన చాలా కాలం తర్వాత సుమారుగా రెండు లేదా మూడు నెలలు ఓటీటీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలకు థియేటర్లలో ఉండే డిమాండ్ దృష్ట్యా, కనీసం 8 వారాల వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసేలా నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘RRR’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘వారణాసి’ కోసం ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. అయితే, మేకర్స్ ఇంకా భారీ డీల్ ఆశిస్తున్నట్లు, అందుకే చర్చలు ఇంకా కొనసాగుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఒకవేళ ఈ డీల్ ఫైనల్ అయితే, కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే సినిమా బడ్జెట్‌లో సగం రికవరీ అయ్యే అవకాశం ఉంది.ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటీనటులు ఉండటం కూడా ఈ రేంజ్ బిజినెస్‌కు ప్రధాన కారణం. 2027లో ఏప్రిల్ 7న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, విడుదలకు ముందే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!