మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఒక మహిళా ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణతో ఫోన్లో వాగ్వాదం పెట్టుకుని ఇరకాటంలో పడ్డారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మరో మహిళా రైతుతో అజిత్ పవార్ వాగ్వాదం పెట్టుకుని వివాదంలో చిక్కుకున్నారు.
X Account Hack: హ్యాకర్ల టార్గెట్లు మామూలుగా లేవండీ బాబు.. వీళ్ల దుంపలు తెగ ఏకంగా ప్రభుత్వాలలో ముఖ్యుల సోషల్ మీడియా ఖాతాలపైనే దృష్టి పెట్టినట్లు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానని అనుకుంటున్నారా.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే ఎక్స్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. నేడు ఆసియా కప్‌లో భారత్- పాక్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో హాకర్లు ఆయన ఎక్స్ ఖాతా నుంచి పాకిస్థాన్, తుర్కియే దేశాల జెండాలు ఉన్న పోస్టులను షేర్…
ముంబై- మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఐపీఎస్ అధికారిణి అంజనా కృష్ణ మధ్య వాగ్వాదం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ విషయంపై ఆయన స్పందించారు. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకోనని ఆయన స్పష్టం చేశారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే తాను ఐపీఎస్ అధికారిణికి ఫోన్ చేసినట్లుగా తెలిపారు.. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టారు ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణ. దీంతో ఆమెకు కాల్ చేసి ఆ చర్యలను వెంటనే…
చట్టాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే చట్టాలు తప్పితే ఇంకెవరు? రక్షణగా ఉంటారు. చెట్లు నరికివేత. అక్రమ ఇసుక తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని న్యాయస్థానాలు మొత్తుకుంటున్నాయి. ప్రభుత్వాలను తీవ్రంగా మందలిస్తున్నాయి.
మాంసం అమ్మకాల నిషేధంపై మహారాష్ట్రలో దుమారం చెలరేగుతోంది. ఆగస్టు 15న గోకులాష్టమి సందర్భంగా.. ఆగస్టు 20న జైన పండుగ పర్యుషణ్ పర్వ సందర్భంగా కబేళాలు, మాంసం దుకాణాలు మూసేయాలని ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది.
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా వ్యవహారం ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు పాకింది. కునాల్ కమ్రాకు సంబంధించిన పోస్టర్లు పబ్లిక్ టాయిలెట్ వెలుపల ప్రత్యక్షమయ్యాయి. మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తే.. ముఖానికి నలుపు రంగు పూసి వీధుల్లో ఊరేగిస్తామంటూ యువసేన అధ్యక్షుడు అనురాగ్ సోనార్ హెచ్చరించారు. శివసేన యువజన విభాగం కార్యకర్తలు.. కునాల్ కమ్రాను హెచ్చరిస్తూ నగరంలో పోస్టర్లు వేశారు.
మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం చీలికల దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ‘వై’ భద్రతను దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. నవంబర్ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి (శివసేన, బీజేపీ, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఊహించని విధంగా గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. 288 స్థానాలకు గాను 233 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.
మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను అమరావతి ఎంపీ, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నవనీత్ కౌర్ దంపతులు కలిశారు. ఫడ్నవిస్ నివాసంలో ఆయనను కలిశారు.